ఉక్రెయిన్‌పై దాడులు నిలిపివేసిన రష్యా

March 05, 2022
img

గత 10 రోజులుగా ఉక్రెయిన్‌పై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా తొలిసారిగా ఈరోజు తాత్కాలికంగా దాడులు నిలిపివేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న విదేశీయులందరూ స్వదేశాలకు తిరిగి వెళ్ళేందుకుగాను భారత్‌ కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు బాంబు దాడులు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో గత పదిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా తీవ్ర ఆందోళనతో ఉన్న ఉక్రెయిన్‌ ప్రజలకు తొలిసారిగా ఇవాళ్ళ కేవలం ఐదున్నర గంటల సేపు యుద్ధవిమానాలు, బాంబులు మోత నుంచి విరామం లభించింది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రష్యా దళాలు బాంబుల వర్షం కురిపించడం మొదలుపెడతాయి కనుక ఈ విరామ సమయంలో లక్షలాది ఉక్రెయిన్‌ ప్రజలు కూడా కార్లు, బస్సులలో పొరుగు దేశాలకు తరలిపోతున్నారు.          


Related Post