తానా అధ్వర్యంలో న్యూయార్క్‌ టైమ్ స్క్వేర్‌లో బతుకమ్మ

October 14, 2021
img

ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) అధ్వర్యంలో  ఈనెల 16 (శనివారం) న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్‌ వద్ద బంగారు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. స్థానిక కాలమానప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్ స్క్వేర్‌లో మొట్టమొదటిసారిగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించబోతున్నామని తానా ప్రతినిధులు తెలిపారు. బంగారు బతుకమ్మ ఉత్సవాలలో బతుకమ్మ ఆటపాటలు, గర్భా డాన్స్, బతుకమ్మ పోటీలు, నృత్య ప్రదర్శనలు, లక్కీడ్రాలు వగైరా ఉంటాయి. 

ఈ ఉత్సవాలలో పాల్గొనదలచినవారు ముందుగా  https://bit.ly/TANABATHUKAMMARSVP వెబ్‌సైట్‌లో తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. బతుకమ్మతో వచ్చినవారికి ప్రత్యేక బహుమతులు ఉంటాయి. లాంగ్ ఐలాండ్, ఎడిసన్ (న్యూజెర్సీ)ల నుంచి వచ్చేవారి కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ బంగారు బతుకమ్మ ఉత్సవాలకు సంబందించి మరిన్ని వివరాల కోసం కింద పేర్కొన్న నెంబర్లలో నిర్వాహకులను సంప్రదించవచ్చు. 

న్యూయార్క్‌: 931-349-2109; 516—270-8918

న్యూజెర్సీ : 732-822-2493; 848-248-1579; 860-805-5406.   


Related Post