కాలిఫోర్నియాలో గాంధీజీ విగ్రహం ధ్వంసం

January 30, 2021
img

గాంధీజీ వర్ధంతి రోజునే అమెరికాలో  గాంధీజీ విగ్రహధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని దుండగులు. వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాలోని డెవిస్ నగరంలోని స్థానిక పార్కు లో గాంధీజీ కాంస్య విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పీఠం మీదనుంచి కూలద్రోసి కొద్ది దూరంలో పడేశారు. ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా బయట పడింది. గాంధీజీ  విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని పోలీసులు వెంటనే పట్టుకొని శిక్షించాలని ప్రవాసభారతీయులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా... భారత విదేశాంగశాఖ కూడా గాంధీజీ విగ్రహం ధ్వంసం పట్ల జో బైడెన్‌ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. దీనికి కారకులైనవారిని కనుగొని శిక్షించాలని విజ్ఞప్తి చేసింది. 


Related Post