ప్రవాసులకు జో బైడెన్‌ శుభవార్త!

January 27, 2021
img

నూతన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసులకు నేడు తొలి శుభవార్త అందించారు. హెచ్-1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములపై ట్రంప్‌ హయాంలో విధించిన ఆంక్షలను ఎత్తివేసి వారు కూడా ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలుకల్పిస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. దీంతో గత రెండేళ్లుగా తీవ్ర ఆందోళనతో భారంగా జీవిస్తున్న లక్షలాదిమంది ప్రవాసభారతీయులతో సహా చైనా, ఫిలిపెన్స్, పాకిస్థాన్‌ తదితర దేశాల ప్రవాసులకు చాలా ఉపశమనం లభించింది. జో బైడెన్‌ నిర్ణయం పట్ల ప్రవాసభారతీయులు హర్షం వ్యక్తం చేశారు. 

హెచ్-1బీ వీసాల జారీపై ఆంక్షలను కూడా సడలిస్తానని, గ్రీన్‌ కార్డ్ మంజూరులో కూడా నిబందనలు సడలించి మరింత వేగంగా అందజేస్తామని జో బైడెన్‌ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. ఈ ఎన్నికల హామీలను కూడా జో బైడెన్‌ ప్రభుత్వం అమలుచేస్తే మళ్ళీ అమెరికాలో ఐ‌టి రంగం పుంజుకొని మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుడు భారతీయులు ‘డాలర్ డ్రీమ్స్’ నెరవేర్చుకోగలుగుతారు.     


Related Post