ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఏటా నిర్వహించే మహాసభలని వచ్చే ఏడాది మే 26,28 తేదీలలో నిర్వహించబోతున్నట్లు తానా అధ్యక్షుడు చౌదరి జంపాల తెలియజేశారు. తానా ఏర్పాటు చేసి 40 సం.లు అవుతున్నందున ఈసారి రెండు నెలలు ముందుగా మే నెలలోనే నిర్వహించాబోతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర విభజన కారణంగా తెలుగుజాతి భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, దేశవిదేశాలలో తెలుగువారు తెలుగుజాతి పేరుప్రతిష్టలు నిలబెడుతున్నారనే సందేశం ఇస్తూ “ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు” అని ఈ మహాసభలకి థీమ్ గా నిర్ణయించారు. తానా కన్వీనర్ డా. కూర్మనధరావు చదలవాడ నేతృత్వంలో తానా మహాసభలకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు.