అమెరికా అధ్యక్ష ఎన్నికలు లేటెస్ట్ అప్-డేట్స్

November 09, 2016
img

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలయింది. ఎన్నికల ప్రచారం ముగిసేవరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడిన డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఫలితాలలో కూడా అదేవిధంగా పోటీ పడుతుండటం విశేషం. మొదట కొద్ది సేపు ట్రంప్, మళ్ళీ తరువాత కొద్ది సేపు హిల్లరీ ఆధిక్యత కనబరచడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం డోనాల్డ్ ట్రంప్ 130 స్థానాలలో విజయం సాధించగా హిల్లరీ క్లింటన్ 104 స్థానాలలో విజయం సాధించారు. మొత్తం 538 స్థానాలలో ఇద్దరిలో ఎవరు కనీసం 270  స్థానాలు గెలుచుకొంటారో వారే అమెరికా అధ్యక్షుడు అవుతారు. ట్రంప్ మరో 140 సీట్లు గెలుచుకోవలసి ఉండగా,  క్లింటన్ 166 సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ విజయావకాశాలున్నట్లు కనిపిస్తోంది.


తాజా సమాచారం:

9.28 AM: డోనాల్డ్ ట్రంప్:197,  హిల్లరీ క్లింటన్:131 స్థానాలలో విజయం సాధించారు.

9.33 AM: డోనాల్డ్ ట్రంప్:201,  హిల్లరీ క్లింటన్:197 స్థానాలలో విజయం సాధించారు. 

9.51 AM: డోనాల్డ్ ట్రంప్:216,  హిల్లరీ క్లింటన్:197 స్థానాలలో విజయం సాధించారు. 

10.17 AM: డోనాల్డ్ ట్రంప్:232,  హిల్లరీ క్లింటన్:209 స్థానాలలో విజయం సాధించారు. 

10.39 AM: డోనాల్డ్ ట్రంప్:244,  హిల్లరీ క్లింటన్:209 స్థానాలలో విజయం సాధించారు.

11.15 AM: డోనాల్డ్ ట్రంప్:244,  హిల్లరీ క్లింటన్:215 స్థానాలలో విజయం సాధించారు.
 


Related Post