తొలివిజయం అందుకొన్న హిల్లరీ

November 08, 2016
img

అమెరికాలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దేశంలో మొట్టమొదట న్యూ హ్యాంప్ షైర్ లో డిగ్జ్ విల్లే నాచ్ లో అప్పుడే ఫలితాలు కూడా వచ్చేశాయి. అక్కడ ఉన్న మొత్తం 8 స్థానాలలో హిల్లరీ క్లింటన్ 4 స్థానాలు గెలుచుకాగా, ట్రంప్ 2 స్థానాలు స్వతంత్ర అభ్యర్ధులు చెరో స్థానం గెలుచుకొన్నారు. ఇక్కడ గెలిచినవారే ఎన్నికలలో గెలిచి అమెరికా అధ్యక్షులవుతారని అమెరికా ప్రజలలో ఒక బలమైన సెంటిమెంటు ఉంది. ఆ ప్రకారం చూసినట్లయితే హిల్లరీ క్లింటన్ సాధించాలి. కానీ అమెరికాలో చేపలు, కప్పలు, కోతులు, స్కూలు పిల్లలు చెప్పే జోస్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని జంతువులు ట్రంప్ గెలుస్తారని జోస్యం చెపుతుంటే, మరికొన్ని హిల్లరీ క్లింటన్ గెలుస్తారని జోస్యం చెపుతున్నాయి. అంటే జంతువులలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోవాలేమో? సాంకేతికంగా ప్రపంచదేశాలకంటే చాలా ముందున్న అమెరికాలో కూడా ఇంకా చేపలు, పిల్లులు చెప్పే జోస్యాలని నమ్ముతున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఏమైనప్పటికీ, రేపు ఉదయం 11గంటల లోగా తుది ఫలితాలు వచ్చేస్తాయి. ఈలోగా ఇంకా ఎన్ని జంతువులు రంగంలోకి దిగుతాయో చూడాలి. 

Related Post