హజ్ యాత్రికులకు ఈ-బ్రాస్లెట్లు

July 02, 2016
img

సౌదీ అరేబియా లోని హజ్ కోసం వచ్చే యాత్రికులను ఇక పై ఈ-బ్రాస్లెట్లు (ఎలక్ట్రానిక్ సేఫ్టీ బ్రాస్లెట్లు) వేసుకోవలసిందిగా నిబంధన వచ్చింది. పోయిన సంవత్సరం హజ్ లో జరిగిన తొక్కిసలాట లో 2297 ప్రాణాలు విడిచిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అలాంటి అవాంతరాలు జరగకుండా, ఈ కొత్త పంధా ఎంచుకున్నారని సమాచారం. 

ఈ-బ్రాస్లెట్ జీపీఎస్ లోకేషన్ కు కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ప్రతి భక్తుడి పూర్తి సమాచారం (వ్యక్తిగత సమాచారం, అడ్రెస్, మెడికల్ రికార్డ్స్) తెలుసుకోవడం సులభం అవుతుంది. తద్వారా తొక్కిసలాట లో తప్పి పోయిన వారి ఆచూకీ కనుక్కోగలుగుతారు. దీనితో పాటు మక్కా లోని గ్రాండ్ మసీదు చుట్టు పక్కల 800 పైగా సీసీ కెమెరాలు పొందుపర్చబడతాయి. ప్రతి ఏడాది, హజ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, అల్లా దైవ దర్శనానికి వస్తారు. ప్రతి ఏడాది తొక్కిసలాట జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడంతో, ఈసారి అలాంటి ప్రాణ నష్టాలేవి జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అధికారుల నుండి సమాచారం. 

Related Post