ఏడు బాల్స్ ఏడు సిక్సర్లు... రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త రికార్డ్

November 28, 2022
img

భారత్‌ క్రికెట్ జట్టుకి మరో సచిన్, మరో సెహ్వాగ్, మరో కొహ్లీ దొరికాడా?అంటే అవుననే చెప్పుకోవాలేమో?విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా అహ్మదాబాద్‌ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ టీమ్స్ మద్య మ్యాచ్ జరిగింది. దీనిలో మహారాష్ట్ర తరపున బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఒక నో బాల్‌తో కలిపి ఏడు బా ల్స్‌లో ఏడు సిక్సర్లు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. అంటే ఏడు బాల్స్‌లో మొత్తం 43 రన్స్ చేశాడన్న మాట! యూపీ బౌలర్ శివసింగ్ వేసిన ప్రతీ బాల్‌ని గైక్వాడ్ అలవోకగా సిక్సర్ షాట్స్ కొడుతుండటం చూస్తే ఎవరికైనా సంతోషం కలుగకమానదు. బిసిసిఐ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 330 స్కోర్ చేయగా వాటిలో గైక్వాడ్ ఒక్కడే 159 బంతులలో 10x4, 16x6 లతో కలిపి 220 పరుగులు చేయడం మరో విశేషం.          

        


Related Post