ఏటా ప్రపంచ కప్ గెలుచుకొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. 2023 వన్డే ప్రపంచ కప్ కోసం అనేక టీమ్‌లు పోటీ పడగా చివరికి భారత్-ఆస్ట్రేలియా జట్లు మాత్రమే ఫైనల్స్ చేరగలిగాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా చివరికి భారత్‌ని ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. ఈసారి భారత్ తప్పకుండా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ కప్ గెలుచుకొంటుందని ఆశగా ఎదురుచూసిన కోట్లాది భారతీయులు ఎంతగానో బాధ పడ్డారు.
క్రీడలలో గెలుపోటములు సహజమే కనుక భారత్ క్రికెట్ టీమ్, భారతీయులు కూడా ఈ ఓటమిని జీర్ణించుకొనేందుకు ఇంకా ప్రయత్నిస్తుండగానే, ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ మార్ష్ రెస్ట్ రూములో సోఫాలో కూర్చొని బీరు త్రాగుతూ ఎదురుగా ఉన్న ప్రపంచ కప్‌పై రెండు కాళ్ళు పెట్టి కూర్చొన్నాడు. ఈ ఫోటో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు.
“మీ జట్టులో అందరూ ఎంతో కష్టపడి ఆడి గెలుచుకొన్న ప్రపంచ కప్ అంటే ఇంత అలుసా? ఇంత చులకనా? నీ సీనియర్స్ నుంచి నేర్చుకొన్నది ఇదేనా మిచెల్?” అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. నిజమే కదా?ఎంతో అపురూపంగా భద్రపరుచుకోవలసిన ప్రపంచ కప్‌ని ఇంత చులకనగా చూడటం క్రికెట్ అభిమానులు ఎవరూ హర్షించలేరు. కానీ మిచెల్ మార్షల్ ఓ క్రికెటర్ అయ్యుండి ఈవిదంగా చేయడం చాలా దారుణమే.