సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి పూణే, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వెళ్ళబోయే ప్రయాణికులకు ఓ ముఖ్య గమనిక. ఈ నెల 29 నుంచి ఆగస్ట్ 10 వరకు పలు రైళ్ళు రద్దు అయ్యాయి. పట్టాలు, ఓవర్ హెడ్ ఎలెక్ట్రిక్ వైరింగ్, సిగ్నలింగ్ తదితర పరికరాల మరమత్తులు, పాడైనవాటి స్థానంలో కొత్తవాటిని అమర్చడం కొరకు తాత్కాలికంగా కొన్ని రైళ్ళను రద్దు చేసి, మరికొన్నిటిని వేరే మార్గాల గుండా గమ్యస్థానాలు చేరుకుంటాయని దక్షిణ మద్య రైల్వే తెలిపింది.
రద్దయిన రైళ్ళు
1. జూలై 29,31, ఆగస్ట్ 1వ తేదీలలో పూణే- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్.
2. జూలై 29,31 తేదీలలో సికింద్రాబాద్-పూణే ఎక్స్‌ప్రెస్.
3. జూలై 30,31 తేదీలలో సికింద్రాబాద్-ముంబై-సికింద్రాబాద్ దూరంతో ఎక్స్‌ప్రెస్.
4. జూలై 31న నిజామాబాద్-పూణే ఎక్స్‌ప్రెస్.
5. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు: విజయవాడ-భద్రాచలం రోడ్-విజయవాడ ప్యాసింజర్ రైళ్ళు.
6. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు: డోర్నకల్-విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్ రైళ్ళు.
7. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు: సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు.
ఈ రైళ్ళు వేరే మార్గంలో గమ్య స్థానాలు చేరుకుంటాయి
1. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు: సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్.
2. ఆగస్ట్ 5 నుంచి 10 వరకు: సికింద్రాబాద్-గూడూరు-సికింద్రాబాద్ సింహపురి ఎక్స్‌ప్రెస్, అదిలాబాద్-తిరుపతి=-అదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్.