హైదరాబాద్‌లో ఉప్పల్‌తో సహా పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుంచే ఓ మోస్తరు వర్షం పడుతోంది. సాయంత్రానికి అది కుండపోతగా మారడంతో ఈరోజు నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్-2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మద్య మ్యాచ్ జరుగవలసి ఉంది. కానీ ఇప్పటికే ఉప్పల్ స్టేడియంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
సాయంత్రం మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. కనుక ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దు అయినా రెండు టీమ్స్‌కి చెరో 15 పాయింట్స్ లభిస్తాయి. దాంతో ‘ప్లే ఆఫ్స్’లో స్థానం సంపాదించుకోగలదు కానీ ఈ మ్యాచ్ జరిగి దానిలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గెలిస్తే నెట్ రన్ రేట్ పెరుగుతుంది కనుక రెండో స్థానానికి చేరుకోగలుగుతుంది. కనుక ఈ మ్యాచ్ జరగడం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి చాలా అవసరం. కానీ వరుణుడు కరుణిస్తాడో లేదో?