రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారంలో రాజ్‌తరుణ్ తండ్రి ఆర్‌జే శేఖర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా కొడుకు ఆమెతో సహజీవనం చేస్తున్నాడనే విషయం ఏడాది తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి నేను, నా భార్య వెళితే కనీసం పెద్దవాళ్ళమనే గౌరవం కూడా లేకుండా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడేది. సామాన్లు విసిరికొడుతూ మాపై పెద్దగా కేకలు వేసేది. ఆమె తీరు చూసిన తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానుకున్నాము.
కానీ ఆమెతో సహజీవనం చేస్తున్నందుకు మా కొడుకు మాత్రం నానా కష్టాలు పడుతూనే ఉన్నాడు. నేను ఏదో సందర్భంలో మాటల్లో ‘లావణ్య మంచి పిల్లే’ అనే చిన్న ముక్క పట్టుకొని తాను మంచిదానినని మేమే చెప్పామని అందరికీ చెప్పుకుంటోంది. కానీ లావణ్య పచ్చి తాగుబోతు. పైగా మాదక ద్రవ్యాలు కూడా సేవిస్తుంటుంది. ఆమెకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. డ్రగ్స్ సప్లయర్లతో కూడా ఆమెకు పరిచయాలున్నాయి.
మా అబ్బాయి రాజ్‌తరుణ్ ఎవరితో మాట్లాడుతున్నా ఆమె సహించలేదు. తల్లి తండ్రులతో మాట్లాడినా ఆమె రాజ్‌తరుణ్‌పై కోపంతో అరుస్తుంటుంది. ఆమెను రాజ్‌తరుణ్ ఎలా భరించాడో గానీ ఈ పదేళ్ళు వాడికీ మాకూ కూడా ఆమె నరకం చూపించింది,” అని అన్నారు.