కాళేశ్వరంతో బిఆర్ఎస్...మూసీతో కాంగ్రెస్‌ కమీషన్లు?

July 24, 2024


img

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు చేస్తున్న విమర్శలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే మెయిన్ విలన్‌. ఓసారి తెలంగాణను ఆంధ్రాతో కలిపింది. మరోసారి ఆంధ్రా నుంచి విడగొట్టింది. కానీ విభజన చట్టంలో సరైనవిదంగా చేయకపోవడం వలననే తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతోంది.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని విభజన చట్టంలో చెప్పలేదు. పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పింది. పరిశీలిస్తే అక్కడ లభించే ముడి ఇనుము నాణ్యమైనది కాదని తేలింది. అందువల్లే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టలేదు తప్ప వేరే కారణం లేదు. 

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందనే కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల వాదనలు సరికాదు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.26,000 కోట్లు విలువైన ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఈవిషయం ఇదివరకు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదని నిందించడం ఓ దూరలవాటుగా మారిపోయింది. 

బిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమీషన్లు దండుకుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కమీషన్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు అవినీతిలో దొందూ దొందే,” అని ఎద్దేవా చేశారు.


Related Post