దణ్ణం పెట్టి చెపుతున్నా... నోరు అదుపులో పెట్టుకోండి: హరీష్ శంకర్‌

April 21, 2024


img

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌, ప్రముఖ కెమెరా మెన్ ఛోటా కె నాయుడుకి మద్య చాలా కాలంగా విభేధాలున్నాయి. ఈ విషయం ఛోటా కె నాయుడే స్వయంగా చెప్పుకొంటూ హరీష్ శంకర్‌పై విమర్శలు చేశారు కూడా.

అయితే హరీష్ శంకర్‌ మాత్రం ప్రతి విమర్శలు చేయకుండా ఇంతకాలం చాలా సంయమనం పాటిస్తున్నారు. కానీ నిన్న తొలిసారిగా లిఖిత పూర్వకంగా, చాలా మర్యాదగా నోరు అదుపులో పెట్టుకోమని ఛోటా కె నాయుడుని హెచ్చరించారు. 

గబ్బర్ సింగ్‌ సినిమాకి మిమ్మల్ని తప్పించి వేరే వారిని పెట్టుకుందామని అనుకున్నప్పటికీ కొందరు శ్రేయోభిలాషుల సూచన మేరకు మీతోనే సినిమా చేశాను. ఓ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దర్శకుడే బాధ్యత వహించాలి కనుక ‘రామయ్య వస్తావయ్య’ సినిమాకు ‘గబ్బర్ సింగ్‌’ సినిమాకు నేనే పూర్తి బాధ్యత వహించాను తప్ప ఎవరినీ నిందించలేదు. 

ఈ పదేళ్ళలో మీరు ఓ 10 ఇంటర్వ్యూలు ఇస్తే ప్రతీ ఇంటర్వ్యూలో నా గురించి చెడ్డగా మాట్లాడారు. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏనాడూ మీ ప్రస్తావన కూడా చేయలేదు. కానీ మీరు నన్ను పదే పదే అవమానిస్తుంటే భరించాల్సిన అవసరం లేదని మిత్రులు, శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను. 

మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. కాదంటే ఎప్పుడైనా ఎక్కడైనా నేను రెడీ,” అంటూ హరీష్ శంకర్‌ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్‌ మాటలు ఆయన సొంత వాఖ్యాలలోనే....       



Related Post

సినిమా స‌మీక్ష