తండేల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కే... అన్ని కోట్లా?

April 30, 2024


img

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఆ సినిమా డిజిటల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

తండేల్ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.40 కోట్లు చెల్లించి సొంత చేసుకుంది. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న నాగ చైతన్యకు ఇది శుభసంకేతంగానే భావించవచ్చు. చందూ మొండేటి  మరో సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 

శ్రీకాకుళం జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు పాకిస్తాన్ కోస్ట్ గార్డు పోలీసులకు చిక్కుతాడు. ఆ తర్వాత అతను పాకిస్తాన్ జైలు నుంచి ఎలా విముక్తి పొందాడు? అతని కోసం హీరోయిన్‌ (సాయి పల్లవి) ఏమి చేసిందనేది ఈ సినిమా కధ, వాస్తవ ఘటనలు ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమా కధ వ్రాసుకున్నారు.       

నాగ చైతన్యకు 23వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల చేస్తున్నారు. తండేల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు. తండేల్ అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష