గచ్చిబౌలిలో గేమ్ చేంజర్‌ షూటింగ్‌....

May 15, 2024


img

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు, రామ్ చరణ్‌ షూటింగ్‌లో బ్రేక్ తీసుకొని తండ్రితో కలిసి ఢిల్లీ వెళ్ళారు.

మళ్ళీ మొన్న సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగినప్పుడు రామ్ చరణ్‌ మరోసారి బ్రేక్ తీసుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళవారం నుంచి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

ఈసారి గచ్చిబౌలీ వద్ద గేమ్ చేంజర్‌ షూటింగ్‌ జరుగుతోంది. రామ్ చరణ్‌తో సహా సీనియర్ నరేష్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, సత్య తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే రామ్ చరణ్‌ ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ సినిమా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.            

 గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా కియరా అద్వానీ నటిస్తున్నారు. కోలీవుడ్‌ నటుడు ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాస్ర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష