రాజ్‌తరుణ్‌ చిలిపి... ఇప్పుడు పురుషోత్తముడా?

July 20, 2024
img

రాజ్‌తరుణ్‌ తన సినిమాల ద్వారా సంపాదించుకున్న పేరు కంటే, లావణ్య కేసుతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. లావణ్యతో 10-11 ఏళ్ళు సహజీవనం చేసిన రాజ్‌తరుణ్‌, కారణాలు ఏవైతేనేమి మాల్వీ మల్హోత్రాతో కూడా రొమాన్స్ మొదలుపెట్టి ‘నారీ నారీ నడుమ మురారీ’గా మారాడు. దాంతో లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం ఇప్పుడు మీడియాలో రాజ్‌తరుణ్‌ పేరు మారుమ్రోగిపోతోంది. 

ఈ సినిమా ఈ నెల 26నా రిలీజ్ కాబోతోంది. రాజ్‌తరుణ్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకుంటాడని దర్శక నిర్మాతలు ఊహించి ఉండరు. కానీ రాజ్‌తరుణ్‌ రాసలీలల గురించి మీడియాలో మారుమ్రోగిపోతుంటే ‘పురోషోత్తముడు’ పేరుతో సినిమా రిలీజ్ చేస్తుండటంతో ఆ టైటిల్‌ చూసి అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు. 

ఈ కేసు ప్రభావం‘పురోషోత్తముడు’ ఎక్కడ పడుతుందో అని దర్శక నిర్మాతలు ఆందోళన చెందడం సహజం. ఈ పరిస్థితిలో వారు కూడా రాజ్‌తరుణ్‌ ‘పురోషోత్తముడు’ అని చెప్పుకోలేరు. కనుక ఈ వివాదం సద్దు మణిగేవరకు వాయిదా వేసుకుంటే మంచిదేమో? 

రామ్ భీమన దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటించింది. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రమ్యకృష్ణ, ముఖేష్ కన్నా, సత్యా, ప్రవీణ్, రాజా రవీంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రామ్ భీమన, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: పీజీ విందా చేశారు. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ కలిసి 5 భాషలలో నిర్మించారు. 

Related Post