నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్‌లో జూన్ 27న విడుదలైన కల్కి ఎడి2898 భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో భారీగా కలక్షన్స్ సాధిస్తూ భారతీయ సినిమా సత్తా యావత్ లోకానికి చాటుతోంది.
నార్త్ అమెరికాలో విడుదలైన మొదటి వారంలోనే రూ. 90కోట్లు, జర్మనీలో రూ.2.25 కోట్లు కలక్షన్స్ సాధించగా, మలేసియాలో కల్కి ఎడి2898 తమిళ వెర్షన్ మొదటి మూడు రోజులలోనే రూ.2.2 కోట్లు సాధించింది. అన్ని చోట్ల ఆర్ఆర్ఆర్, సలార్, బ్రహ్మాస్త్ర, కేజీయఫ్-2 సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.
కల్కి ఎడి2898 సినిమాని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా, మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.555 కోట్లు రాబట్టింది. కనుక కల్కి ఎడి2898 అన్ని సినిమాల రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాలలో తొలిరోజు అత్యధిక కలక్షన్స్ (రూ.191.50 కోట్లు) సాధించిన సినిమాగా కల్కి ఎడి2898 నిలిచింది.
తెలంగాణలో మొదటి 8 రోజులు, ఆంధ్రాలో మొదటి రెండు వారాలు టికెట్ ధరలు పెంచుకొని, అదనపు షోలు వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. టికెట్ ధరలు భారీగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు కల్కి ఎడి2898 సినిమా చూసేందుకు క్యూకడుతూనే ఉన్నారు. యావత్ దేశంలో కల్కి ఎడి2898 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతూనే ఉన్నాయి.