ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో గత 5 ఏళ్ళుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు చేసిన పాపాలన్నీ ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అందిన చోటల్లా అప్పులు చేస్తూ సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు లక్షల కోట్లు పంచిపెట్టారు.
ప్రజలకు డబ్బు పంచిపెడితే మళ్ళీ మళ్ళీ తమకే ఓట్లు వేసి గెలిపిస్తారని జగన్ అనుకున్నారు. ఆ ధీమాతోనే 175కి 175 సీట్లు మేమే గెలుచుకుంటామని చివరి వరకు ప్రగల్భాలు పలికారు. కానీ ఆంధ్రా ప్రజలు జగన్ దురాలోచన పసిగట్టారు.
అందుకే 5 ఏళ్ళపాటు ఆయన పంచిన డబ్బు తీసుకుని చివరికి టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. 175 ఎమ్మెల్యే సీట్లలో జగన్‌కి కేవలం 11 రాగా మిగిలిన 164 సీట్లు కూటమి గెలుచుకొని భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
ఈరోజు ఏపీ శాసనసభలో చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజాటేషన్ ద్వారా జగన్ హయాంలో విశాఖలో తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తుల వివరాలను, వాటిపై ఆయన చేసిన అప్పులను వివరించారు. వాటిలో తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ క్వార్టర్స్, రైతు బజారు వంటివి కూడా ఉండటం విశేషం.
ఒక్క విశాఖ నగరంలోనే 154 ఎకరాలు విస్తీర్ణం కలిగిన వివిద ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి రూ.1,941 కోట్లు అప్పులు తీసుకున్నారు. కనుక తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈవిదంగా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా తాక్కట్టు పెట్టి అప్పులు తీసుకుందా లేదా అనేది సిఎం రేవంత్ రెడ్డి చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులలో కొన్ని
రైతు బజార్: (4 ఎకరాలు): 91 కోట్లు.
తహశీల్దార్ ఆఫీస్: (1 ఎకరం): 34 కోట్లు
ప్రభుత్వం ఐటిఐ: (17 ఎకరాలు): 270 కోట్లు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (24 ఎకరాలు): 359 కోట్లు
పోలీస్ క్వార్టర్స్ (9 ఎకరాలు): 215 కోట్లు
డెయిరీ ఫారం: (30 ఎకరాలు): 309 కోట్లు
పీడబ్ల్యూడీ ఆఫీస్: (4 ఎకరాలు) : రూ.79 కోట్లు.