రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాశి’ ఓ తాజా అప్‌డేట్! ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి పాత్ర చేయబోతున్నారు. ఈ పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి ఇద్దరు వేరే నటులపై టెస్ట్ షూట్ చేశారు. కానీ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ప్రకాష్ రాజ్‌తో ప్రయత్నించగా అద్భుతంగా వచ్చింది. కనుక అయనని ఖరారు చేశారు. ప్రకాష్ రాజ్ నేటి నుంచే షూటింగ్‌లో జాయిన్ అవుతున్నట్లు తాజా సమాచారం.
ఈ సినిమాలో విలన్ కుంభగా మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.