ఈటీవీ విన్‌లోకి రాజు వెడ్స్ రాంబాయి

December 13, 2025


img

దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తీసిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’ నవంబర్‌ 21న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. హీరోహీరోయిన్లతో సహా నటీనటులలో దాదాపు అందరూ కొత్తవారే అయినప్పటికీ చక్కగా నటించి మెప్పించారు. మరో విశేషమేమిటంటే, దర్శకుడు సాయిలు కంపాటికి ఇదే తొలి సినిమా.

సినిమా కధ, కధనం, భావోద్వేగాలు, డైలాగ్స్, పాటలు, సంగీతం అన్నీ చక్కగా కుదరడంతో సినిమాకు ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 17 కోట్లు పైనే కలెక్షన్స్ సాధించింది.

థియేటర్లలో విడుదలై అప్పుడే నెలరోజులు కావస్తోంది కనుక రాజు వెడ్స్ రాంబాయి ఈ నెల 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతున్నట్లు తాజా సమాచారం.        

ఈ సినిమాలో రాజు, రాంబాయిగా  అఖిల్, తేజస్వి రావు నటించారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్యపాత్రలు చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష