నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున ఫస్ట్ గ్లిమ్స్‌

December 14, 2025


img

మహేష్ బాబు ఉప్పల దర్శకత్వంలో అనేష్. అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న ‘ఇట్లు అర్జున’ ఫస్ట్ గ్లిమ్స్‌ నాగార్జున వాయిస్ ఓవర్‌తోతో నేడు విడుదలైంది. 

ప్రేమపై అనేక వందలు, వేల సినిమాలు వచ్చాయి. అయినా ప్రేమ తాజాగానే ఉంది. ఎప్పటికప్పుడు ప్రేమలో కొత్త కోణాలు చూపిస్తూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. అటువంటిదే ఇట్లు అర్జున. ఈ సినిమాలో ప్రేమికుడు మూగవాడు. మాట్లాడలేని వ్యక్తి తన ప్రేమను ఎలా తెలియజేయగలడు? అనే పాయింట్ తీసుకొని ఓ మూగ ప్రేమికుడు ప్రేమకాదని ‘ఇట్లు అర్జున’గా రూపొందిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌ చూస్తే అర్ధమవుతుంది.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: మహేష్ బాబు ఉప్పల, అడిషనల్ స్క్రీన్ ప్లే: మానస శర్మ, సంగీతం: తమన్, కెమెరా: రాజాసాబ్‌ మహదేవన్, ఎడిటింగ్: కోటి కె,  స్టంట్స్: దినేష్ సుబ్బరాయన్, ఆర్ట్: రామ్ కుమార్‌,  చేశారు. వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుమల నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష