జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్ మారుతున్నాయి

December 13, 2025


img

హైదరాబాద్‌, లింగంపల్లి-విశాఖపట్నం మద్య నడుస్తున్న జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మారబోతున్నాయి. 

లింగంపల్లి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్ నం.12806) ఉదయం 6.55 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

అదేవిధంగా విశాఖ నుంచి (ట్రైన్ నం.12805) ఉదయం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 7.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. 

సంక్రాంతి పండగ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనుక దక్షిణ మద్య రైల్వే కొన్ని వీక్లీ రైళ్ళను అధనంగా మరికొన్ని రోజులు నడిపించబోతోంది. 

సికింద్రాబాద్‌-అనకాపల్లి ట్రైన్ నం: 07041 జనవరి 4,11,18 తేదీలలో కూడా నడుస్తుంది. 

అనకాపల్లి-సికింద్రాబాద్‌ ట్రైన్ నం: 07042 జనవరి 5,12,19 తేదీలలో కూడా నడుస్తుంది.

హైదరాబాద్‌-ఘోరక్‌పూర్ ట్రైన్ నం: 07075 జనవరి 9, 16,23 తేదీలలో కూడా నడుస్తుంది. 

ఘోరక్‌పూర్-హైదరాబాద్‌ ట్రైన్ నం: 07076 జనవరి 11, 18, 25 తేదీలలో కూడా నడుస్తుందని దక్షిణ మద్య రైల్వే  ప్రకటించింది.


Related Post

సినిమా స‌మీక్ష