రవీంద్ర భారతిలో ఎస్పీ విగ్రహావిష్కరణ

December 14, 2025
img

హైదరాబాద్‌ రవీంద్రభారతి సాహిత్యం, కళలకు నిలయం. అటువంటి చోట తెలుగు ప్రజలకు గర్వకారణమైన పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ చేయబోతున్నారు.

దీని కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొనబోతున్నారు.  


Related Post