తెలంగాణలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది. సాయంత్రం 6.45 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 1204 సర్పంచ్ పదవులు గెలుచుకోగా, బీఆర్ఎస్ పార్టీ 544, బీజేపీ 156, ఇతరులు 343 పదవులు గెలుచుకున్నారు.
ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ పదవులు దక్కించుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా గణనీయంగానే పదవులు గెలుచుకొని నేటికీ గ్రామ్యస్థాయిలో తనకు తిరుగు లేడని నిరూపించుకుంది. ఎప్పటిలాగే బీజేపీ మూడో స్థానానికే పరిమితమయ్యింది.
కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 79, మహబూబాబాద్ జిల్లాలో 72 నల్గొండలో 65 స్థానాలు గెలుచుకుంది. అత్యల్పంగా కుమురం భీమ్ జిల్లాలో 9 మాత్రమే గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది.
బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సిద్ధిపేటలో 52, మెదక్ 36 , మహబూబ్ నగర్ జిల్లాలో 34 పదవులు గెలుచుకుంది. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 , పెద్దపల్లి, గద్వాల జిల్లాలో చెరో 7 స్థానాలు గెలుచుకుంది.