విక్టరీ వెంకటేష్‌ హ్యాపీ బర్త్ డే.. అనిల్ రావిపూడి గిఫ్ట్

December 13, 2025


img

ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనతో సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఊహించని బహుమతి ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌ సుమారు అర్ధ గంటసేపు స్క్రీన్ మీద చిరంజీవితో కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే చిరంజీవి, వెంకటేష్‌ మీద ఓ ఫెస్టివల్ సాంగ్‌ షూట్ చేశారు కూడా.

నేడు వెంకటేష్‌ పుట్టిన రోజు సందర్భంగా తన టీమ్‌తో కలిసి ఎనీ టైమ్‌... ఎనీ ప్లేస్... సింగిల్ హ్యాండ్ అంటూ ఓ చిన్న వీడియో చేసి వెంకటేష్‌ కి అభినందనలు తెలిపారు. 

వెంకటేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కాబోతోంది.     


Related Post

సినిమా స‌మీక్ష