బీఆర్ఎస్‌ మౌనం రాజకీయ ఆత్మహత్యతో సమానమే!

December 12, 2025


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ స్పందించకుండా మౌనంగా ఉండిపోతున్నారు. 

ఇదివరకు షర్మిల విషయంలో ఈ మౌన వ్యూహం బాగా పనిచేసింది కానీ కల్వకుంట్ల కవిత విషయంలో వారి మౌనం అర్దాంగికారంగానే ప్రజలు పరిగణిస్తారు. కనుక అది బీఆర్ఎస్‌ పార్టీ విశ్వసనీయతని పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. 

మాధవరం కృష్ణారావు, నిరంజన్ రెడ్డి వంటి ఒకరిద్దరు ఆమెకు మాటకు మాట చెపితేనే ఇంత అనర్ధం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్‌, కేటీఆర్‌ ఆమెకు జవాబులు చెప్పడం మొదలుపెడితే ఆమెకు ఉచితంగా మరింత పబ్లిసిటీ ప్రజాధరణ సంపాదించి పెడుతుంది.

పైగా తండ్రి, కొడుకు, కూతురు ముగ్గురూ మాటల యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపి వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. అప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ మరింత వేగంగా విశ్వసనీయత కోల్పోతుంది. బహుశః అందువల్లే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ మౌనంగా ఉండిపోక తప్పడం లేదు. 

కానీ వారి మౌనం కూడా బీఆర్ఎస్‌ పార్టీకి శాపంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ సమస్యని కేసీఆర్‌ ఏవిధంగా పరిష్కరించుకుంటారో?


Related Post