మన శంకర ప్రసాద్ గారు జనవరి 12న వస్తున్నారు

December 14, 2025


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా రూపొందిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’ జనవరి 12 న సంక్రాంతి పండగకు రెండు రోజుల ముందు విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవి పోస్టర్‌ ఒకటి విడుదల చేసింది. అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటారో దానిలో అంత స్టైలిష్‌గా ఉన్నారు. 

కూడా ఓ ముఖ్య పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు తమ టీమ్‌లోకి స్వాగతం పలుకుతూ చిరంజీవి ఓ ఫోటో అభిమానులతో షేర్ చేశారు. చిరంజీవి, వెంకటేష్‌ ఇద్దరూ దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. కనుక వారిద్దరూ తొలిసారిగా కలిసి ఈ సినిమా చేస్తుండటంతో వారి అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రెండో హీరోయిన్‌గా క్యాథరిన్‌ చేస్తున్నారు. హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 12న సంక్రాంతి పండగకి ముందు విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష