శర్వా నారి నారీ నడుమ మురారి.. సంక్రాంతికే కానీ...

December 13, 2025


img

శర్వానంద్ ఓ పక్క ‘బైకర్’ రెడీ  చేస్తూనే మరో పక్క  నారి నారీ నడుమ మురారి అంటూ సంక్రాంతికి వచ్చేస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆ ఇద్దరు నారులు సంయుక్త, సాక్షి వైద్య. సినిమా టైటిల్‌తోనే ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని స్పష్టమైపోయింది.

ఇదివరకు శర్వా, అనుపమ పరమేశ్వరన్ జోడీగా 'శతమానం భవతి' సంక్రాంతికే విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ సినిమాని కూడా సంక్రాంతికే అంటే 2026, జనవరి 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

కానీ ఆరోజు మార్నింగ్ షోకి బదులు ఫస్ట్ షో (సాయంత్రం 5.49 గంటలకు) విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. 

ఈ సినిమాకి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేస్తున్నారు. భాను భోగవరపు, నందు సవిరిగన, వెంకట స్వామి, బ్రహ్మ కడలి, రామజోగయ్య శాస్త్రి, వంశీ-శేఖర్, తదితరులు ఈ సినిమా టీమ్‌లో ఉన్నారు.       

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష