తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘ఆస్క్ కవిత’ అంటూ సోమవారం సోషల్ మీడియాలో నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా “2029 శాసనసభ ఎన్నికలలో నేను తప్పకుండా పోటీ చేస్తాను,” అని చెప్పారు.
ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఒంటరి అయ్యారు. తెలంగాణ జాగృతితో ముందుకు సాగుతున్నారు. కానీ అది రాజకీయ పార్టీ కాదు. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రాజకీయ స్పష్టత చాలా అవసరం.
తాను రాజకీయాలలోనే కొనసాగాలనుకుంటున్నానని ఇదివరకే స్పష్టంగా చెప్పారు. అంతే కాదు... ఫిబ్రవరిలో ‘జనం బాట’ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు. ఏదో రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్తున్నానని కూడా చెప్పారు. ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పారు. కనుక ఆమెకు తన రాజకీయ ప్రస్తానం గురించి పూర్తి స్పష్టత ఉందని అర్ధమవుతోంది.
ఇంత స్పష్టత ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీల నాయకులు ఆమెతో చేతులు కలుపుతారు. ప్రజలు ఆమెను నమ్ముతారు. కనుక ఈవిధంగా చెప్పడం ఆమె రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా భావించవచ్చు.