మాధవరంతో కవిత కీచులాట ఎఫెక్ట్: విజిలెన్స్ విచారణ

December 16, 2025


img

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్‌ కబ్జా చేసినట్లు చెప్పబడుతున్న ఐడీపీఎల్ భూములపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.  

కవిత భర్త అనిల్ కుమార్‌, ఐవీ రెడ్డి, మరో వ్యక్తితో కలిసి కేసీఆర్‌ హయంలో సర్వే నం.376లో ఈ భూములు కొనుగోలు చేశారు. ఓవర్ ల్యాప్‌టాప్‌ భూముల పేరుతో కవిత భర్త అనిల్ కుమార్‌ వాటిని కబ్జా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. వాటి విలువ సుమారు రూ.4,000 కోట్లు వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు. ఈ విచారణలో కల్వకుంట్ల కవిత నీతి కబుర్ల వెనుక వాస్తవాలు బయట పడతాయన్నారు.

అయితే తాను, తన భర్త ఎన్నడూ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదని నిజాయితీగా సంపాదించుకొని బ్రతుకుతున్నామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ ధైర్యంతోనే తాను ప్రజల మధ్యన తలెత్తుకు తిరుగుతున్నానని అ న్నారు. కానీ విచ్చలవిడిగా భూకబ్జాలు చేసిన మాధవరం కృష్ణారావు తన అవినీతి మరకలను నాకు అంటించాలని చూస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీస్ కూడా పంపారు. వారం రోజులలోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకీడు స్తానని హెచ్చరించారు కూడా.

ఆయన క్షమాపణలు చెప్పలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కవిత దంపతులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఈ అవినీతి ఆరోపణలు కొత్త మలుపు తిరిగాయి. 


Related Post