కల్కి ఎడి2898 జూన్ 27నే విడుదల కానీ...

May 11, 2024


img

ప్రభాస్‌-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సిద్దమైన కల్కి ఎడి2898 ఊహించిన్నట్లే జూన్ 27కి వాయిదా పడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొని ఉన్నందున ఇంత భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాని ఈ సమయంలో విడుదల చేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంధి. కనుక మే 8కి విడుదల కావలసిన ఈ సినిమాని జూన్ 27కి వాయిదా వేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. 

ఇది అభిమానులు కూడా అర్దం చేసుకోగలరు కనుక సినిమా వాయిదాపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈ సినీ నిర్మాత అశ్వినీ దత్ సోషల్ మీడియాలో పెట్టిన సందేశంతో ఆందోళన చెందుతున్నారు. 

“శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి విజయం.. రేపటి విద్యార్థుల భవిష్యత్తు కోసం, రేపటి యువత ఉపాధి కోసం, రేపటి రాష్ట్ర అభివృద్ధి కోసం, రేపటి మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, మన తెలుగుదేశం, రేపటి కోసం’ అంటూ ‘రేపటి కోసం ఓటు వేయండి” అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈసారి ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్న టిడిపి, జనసేన, బీజేపీలు గెలిచే అవకాశం కనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ వైసీపి గెలిచి మళ్ళీ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కల్కి ఎడి2898 సినిమాకి జగన్‌ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించవచ్చని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమని ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. మళ్ళీ వస్తే తమ కష్టాలు ఇంకా పెరిగిపోతాయని భయపడుతున్నారు. అందుకే సినీ ప్రముఖులలో చిరంజీవితో సహా పలువురు పవన్‌ కళ్యాణ్‌, జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి భయపడి వెళ్ళడం మానుకున్నారు.

కానీ పలువురు సోషల్ మీడియాలో పవన్‌ కళ్యాణ్‌ని లేదా కూటమిని గెలిపించాలని సందేశాలు పెడుతున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష