యువ హీరోలలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజ్ తరుణ్. అయితే చాలా కాలంగా సరైన హిట్ పడక ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్నవారితో పోటీ పడలేక వెనకబడిపోయాడు.
తాజాగా ‘పురుషోత్తముడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు విడుదల చేసిన ఈ సినిమా టీజర్ చాలా అక్కటుకునేలా ఉంది.
ముఖ్యంగా' “ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడయితే... మరొక యుగంలో నాన్న మాట వినని ప్రహ్లదుడు మహనీయుడు అయ్యాడు,” అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలు పెట్టిన విధానం చాలా బాగుంది.
ఈ సినిమా ఓ పల్లెటూరులో అందరివాడుగా ఉండే హీరోకి, పట్టణం నుంచి వచ్చిన ఓ విలన్‌కు మద్య జరిగే ఘర్షణ మద్యలో ‘పల్లెటూరు రొమాన్స్’తో బాగానే తెరకెక్కించిన్నట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రమ్యకృష్ణ, ముఖేష్ కఃన్నా, సత్యా, ప్రవీణ్, రాజా రవీంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రామ్ భీమన, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: పీజీ విందా చేశారు. ఈ సినిమాని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ కలిసి 5 భాషలలో నిర్మించి త్వరలో విడుదల చేయబోతున్నారు.