సుహాస్ ప్రసన్న వదనం సెన్సార్ రిపోర్ట్

May 02, 2024
img

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి చక్కటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుహాస్, ఇప్పుడు అర్జున్ వైకే దర్శకత్వంలో ‘ప్రసన్న వదనం’ అనే మరో సినిమాతో రేపు (మే3) న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూట్యూబ్‌లో/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.  

హీరో తలకి గాయమవడంతో ఎవరి మొహాలను గుర్తించలేని ఓ అరుదైన సమస్య ఏర్పడుతుంది. అంటే గజినీ సినిమా టైప్ అనుకోవచ్చన్న మాట! ట్రైలర్‌ చూస్తే ఇదో పెద్ద క్రైమ్ స్టోర్ అని స్పష్టమవుతుంది. అయితే దానిలో సుహాస్‌ ఉండటంతో కాస్త కామెడీ కూడా సినిమాకు జోడించగలిగారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్‌ నాయుడు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని, ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అర్జున్ వైకే, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: ఎస్‌.చంద్రశేఖర్న్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్‌, ఆర్ట్: క్రాంతి ప్రియం చేశారు. 

లిటిల్ థాట్స్, అర్హా మీడియా బ్యానర్లపై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ కలిసి నిర్మించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదల కాబోతోంది. Related Post