దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోందిగా

May 16, 2024


img

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో సిద్దమవుతున్న ‘దేవర’ మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.

సినిమా విడుదలకు ఇంకా 6 నెలలు సమయం ఉన్నప్పటికీ, ఈ నెల 20న జూ.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ (లిరికల్ వీడియో సాంగ్‌)ని ఒకరోజు ముందుగా మే 19న విడుదల చేయబోతున్నారు. 

ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బెట్స్ పనిచేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో నీళ్ళ అడుగున తీసిన ఓ యాక్షన్ సీన్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందని, ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని దేవర బృందం చెప్పింది. దేవరలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. 

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు దేవరలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష