డబుల్ ఇస్మార్ట్ టీజర్‌... రామ్ ఖాతాలో మరో హిట్?

May 15, 2024


img

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని, కావ్యా థాపర్ జంటగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. బుధవారం రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

పూరీ మార్క్ యాక్షన్, రామ్ పోతినేని ఎనర్జీ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్థాయి. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అవడంతో ఇద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్, షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను, మార్ఖాండ్ దేశ్ పాండే, టెంపర్ వంశీ, బని జె తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పూరీ జగన్నాథ్, సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, జియని జియనెల్లి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్, యాక్షన్: కేచ ఖాంఫఖ్ డీ, రియల్ సతీష్. 

ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష