పుష్ప-2లో అనసూయ ఫస్ట్-లుక్ పోస్టర్‌... చూశారా?

May 16, 2024


img

యాంకర్ స్థాయి నుంచి సినిమా నటిగా ఎదిగిన అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పుష్ప-2లో ఆమె ఫస్ట్-లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది పుష్ప-2 బృందం. రామ్ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో సూపర్ హిట్ ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ రంగమత్తగా చేసినప్పుడే తనకంటూ సరికొత్త ఇమేజ్‌ సంపాదించుకున్నారు.

పుష్ప మొదటి భాగంలో ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఆమె పాత్ర, వేషధారణ, నటన ఉన్నాయి. కనుక పుష్ప-2లో ఆమె పాత్ర మరింత కరుకుగా ఉండవచ్చని ఈరోజు విడుదల చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్‌ చూస్తే అర్దమవుతుంది. 

పుష్ప-2లో కూడా అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మొదటి భాగంలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన యువతి పాత్ర కనుక అందుకు తగ్గట్లుగానే ఆమె భాష, యాస, వేషధారణ అన్నీ ఉన్నాయి.

కానీ పుష్ప-2లో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగిలింగ్ వ్యాపారంలో బాగా ఆర్జించి ధనికుడుగా మారుతాడు కనుక అతని భార్యగా నటిస్తున్న రష్మిక మందన, పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా బంగారు నగలతో నడిచివస్తున్న లక్ష్మీదేవిలా కనిపించబోతోంది.  

 ‘పుష్ప-2లో కూడా మలయాళ సినీ నటుడు ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా నటిస్తున్నారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది. 

 Related Post

సినిమా స‌మీక్ష