కుబేరలో నాగార్జున ఫస్ట్-లుక్ పోస్టర్‌

May 03, 2024


img

శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కుబేర.  ఇప్పటికే ధనుష్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. తాజాగా నాగార్జున ఫస్ట్-లుక్ కూడా విడుదల చేశారు. కేవలం పోస్టర్తో సరిపెట్టేయకుండా చిన్న వీడియోని కూడా రిలీజ్ చేశారు. సమాజం-డబ్బు కధాంశంగా తీసుకొని ఈ సినిమా తీస్తున్నట్లు ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ చూస్తే అర్దమవుతుంది. ఈ సినిమాలో నాగార్జున ఓ నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసరుగా చేస్తున్నట్లు తెలుస్తోంది.   

కుబేరాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష