విజయశాంతి సినిమాలలో రాణించగలిగారు కానీ నేటికీ రాజకీయాలలో రాణించలేకపోతున్నారనే అనుకోవచ్చు. ఆమె రాష్ట్రంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలలో పనిచేశారు. దేనిలోనూ ఆమెకు ప్రాధాన్యఠ, గుర్తింపు లభించలేదనే చెప్పాలి.
బిఆర్ఎస్‌లో ఉండగా ఆమె ఎంపీ కాగలిగారు. ఆమె రాజకీయ జీవితంలో అంతకు మించి ఏమీ సాధించలేకపోయారు.
ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు, చివరికి ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. అయినా ఆమెను ఎవరూ ఆహ్వానించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో ఆమె మళ్ళీ బిఆర్ఎస్ గూటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు.
“లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ అనే ఓ పార్టీ ఇక కనిపించదు,” అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆమె ట్వీట్ చేశారు.
“ప్రజల భావోద్వేగాలను, వారి ఆత్మాభిమానానికి ప్రాంతీయ పార్టీలు ప్రతీకలుగా నిలుస్తాయి. దక్షిణాది రాష్ట్రాలలో కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత మొదలు నేటి బిఆర్ఎస్, వైసీపిల వరకు అన్ని పార్టీలు ఇదే విధానంతో సాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం ఇది. దీనిని అర్దం చేసుకోకుండా కిషన్ రెడ్డి మాట్లాడటం సరికాదు,” అన్నారు.
జాతీయ పార్టీలో ఉన్న విజయశాంతి ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీని వెనకేసుకు వస్తూ బీజేపీని విమర్శిస్తుండటం గమనిస్తే ఆమె మళ్ళీ బిఆర్ఎస్ గూటికి చేరుకునే ఆలోచనలో ఉన్నట్లు అనిపించక మానదు.
ఇంతకీ ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే