భారత్‌-పాక్ క్రికెట్ అభిమానులకు శుభవార్త

September 08, 2023
img

భారత్‌-పాక్ క్రికెట్ అభిమానులకు శుభవార్త ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ శుభవార్త చెప్పింది. సూపర్-4లో భాగంగా ఈనెల 10వ తేదీన కొలంబోలో భారత్‌-పాక్ మద్య మ్యాచ్ జరగవలసి ఉంది. ఇప్పటికే ఓసారి పల్లెకెలె వేదికగా ఇరు జట్ల మద్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో వర్షం కారణంగా పలుమార్లు ఆటంకం కలిగింది. దానిలో టాస్ గెలిచిన భారత్‌ ఎలాగో ఇన్నింగ్స్ పూర్తి చేసింది కానీ వర్షం కారణంగా పాక్ మాత్రం ఆడలేకపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

అయితే ఈనెల 10వ తేదీన జరుగబోయే ఈ మ్యాచ్ ఫైనల్స్  చేరుకొనేందుకు చాలా కీలకమైనది కావడం, అదీ...భారత్‌-పాక్ మద్య జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో 10వ తేదీ మ్యాచ్‌ను రిజర్వ్ డేగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అంటే ఆరోజు మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఒకవేళ వర్షం పడి మద్యలో ఆగిపోయినా, మర్నాడు అది ఎక్కడ ఆగిపోయిందో  అక్కడి నుంచే మ్యాచ్‌ మొదలుపెట్టి పూర్తిచేస్తారు. సెప్టెంబర్‌ 17న జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే మ్యాచ్‌గానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. కనుక దానినీ అవసరమైతే మర్నాడు కొనసాగించి పూర్తిచేస్తారు. 

ఈ ఆదివారం జరుగబోయే ఈ మ్యాచ్‌కు ఇద్దరు భారత ఆటగాళ్లు టీంలో మళ్ళీ చేరబోతున్నారు. మద్యలో బ్రేక్ తీసుకొని భారత్‌ వచ్చిన స్టార్ బౌలర్ జగన్ సర్కార్‌కి ప్రీత్ బుమ్రా, రోడ్డు ప్రమాదంలో గాయపడి సర్జరీ చేయించుకొని కోలుకొన్న కెఎల్ రాహుల్ ఇద్దరూ పాకిస్తాన్‌తో జరుగబోయే ఈ మ్యాచ్‌లో ఆడబోతున్నారు.

Related Post