కల్కి ఎడి2898 జూన్‌కి వాయిదా?

April 21, 2024


img

ప్రభాస్‌ హీరోగా సిద్దమవుతున్న కల్కి ఏడి-2898 పాన్ ఇండియా మూవీ జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికానందున మే 9కి వాయిదా వేసిన్నట్లు  చేయబోతున్నట్లు ప్రకటించారు. 

కానీ మే 13న ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండటం, ఆ తర్వాత మిగిలిన మూడు విడతల ఎన్నికలు జూన్ 1వరకు కొనసాగుతుండటం వలన దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొని ఉంటుంది. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో రాజకీయంగా కొంత హడావుడి నెలకొని ఉంటుంది. 

కనుక రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కల్కి ఎడి2898ని ఎన్నికల మద్యలో విడుదల చేయడం చాలా రిస్క్ అవుతుంది. కనుక ఈ రాజకీయ హడావుడి అంతా సద్దుమణిగాక జూన్ 20వ తేదీన విడుదల చేయాలని వైజయంతీ మూవీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

జూన్ నెలలోనే శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఇండియన్-2 కూడా విడుదల కాబోతోంది. కమల్ హాసన్ కల్కి ఎడి2898లో కూడా నటిస్తున్నారు కనుక ఆయన అభిమానులకు ఒకే నెలలో రెండు సినిమాలు చూసే అదృష్టం కలిగితే చాలా సంతోషిస్తారు.


Related Post

సినిమా స‌మీక్ష