తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపే

April 23, 2024


img

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు బుధవారం వెలువడబోతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,  ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ బోర్డు కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారు. 

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వరకు జరిగిన ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్షలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్దులు హాజరయ్యారు. వారిలో ఇంటర్ ప్రధమ సంవత్సర విద్యార్దులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్దులు 4,43,993 మంది ఉన్నారు. ఒకేషనల్ కోర్సులలో ఇంటర్ ప్రధమ సంవత్సర విద్యార్దులు 48,277 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్దులు 46,542 మంది పరీక్షలు వ్రాశారు. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు రెండూ ఒకేసారి ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శు శృతి ఓజా తెలిపారు.

ఒకటి రెండు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాలపై అనేక వివాదాలు ఏర్పడినందున, ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఫలితాలలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా మూల్యాంకనంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, అన్ని సరిచూసుకొన్న తర్వాతే ఫలితాలు ప్రకటిస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.      



Related Post