కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

April 23, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయ్యి  గత నెలన్నర రోజులుగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోసం చేస్తున్న ప్రయత్నాలెవీ ఫలించడం లేదు. మొదట ఈడీ ఆమెను అరెస్ట్ చేసినప్పుడు ఆమె బెయిల్‌ కోసం ప్రయత్నించగా ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత ఆమె సీబీఐ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌లోకి మారినప్పుడు మళ్ళీ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఫలించడం లేదు. 

సోమవారం ఆమె బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఓ మహిళగా ఆమె బెయిల్‌కు అర్హురాలని ఆమె తరపు బ్యాయవాది వాదించగా, ఆమె రాజకీయంగా చాలా శక్తివంతమైన వ్యక్తి అని ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను, కేసు విచారణను కూడా ప్రభావితం చేస్తారు కనుక ఎట్టి పరిస్థితులలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయవద్దని సీబీఐ తరపు న్యావాది వాదించారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కావేరీ బవేజా కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుపై విచారణ జరుపుతున్నప్పుడు కల్వకుంట్ల కవిత నేరానికి పాల్పడిన్నట్లు న్యాయమూర్తి కావేరీ బవేజా అభిప్రాయం వ్యక్తం చేసినందున ఆమెకు బెయిల్‌ మంజూరు అవడం కష్టమే కావచ్చు.


Related Post