కాళేశ్వరంపై జస్టిస్ చంద్ర ఘోష్ విచారణ షురూ

April 25, 2024


img

జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ గురువారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్ర ఘోష్ మీడియాతో మాట్లాడుతూ, “మా విచారణ కోసం ఈ ప్రాజెక్టుతో సంబందం ఉన్న అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు అందరినీ ప్రశ్నించి వివరాలు సేకరించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాము. 

అయితే వ్యక్తులు, వారి అధికార, రాజకీయహోదాలను బట్టిగాక వారు చెప్పే ఆర్ధిక, సాంకేతిక, పాలనాపరమైన అంశాల ఆధారంగానే నివేదిక తయారుచేస్తాము. అవసరమైతే మాజీ సిఎం కేసీఆర్‌కి కూడా నోటీస్ పంపించి రప్పించుకొని వివరాలు సేకరిస్తాము. 

దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన విజిలెన్స్ నివేదికను, కాగ్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొంటాము. ఈ విచారణలో భాగంగా ఇంజనీరింగ్, ఆర్ధిక తదితర నిపుణుల సాయం తీసుకొని విషయ సేకరణ చేసి విశ్లేషించి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. 

ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం సంబందిత వ్యక్తుల చట్టపరమైన చర్యలు తీసుకొంటుందని, కనుక అప్పుడు న్యాయపరమైన సమస్యలు ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని జస్టిస్ చంద్ర ఘోష్ మీడియాకు తెలియజేశారు. 


Related Post