నా కొడుకు ఆత్మహత్యపై మళ్ళీ విచారణ జరిపించండి

May 04, 2024


img

2016లో హైదరాబాద్‌ యూనివర్సిటీ విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచనం సృష్టించింది. యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు, కొందరు నేతల వేధింపుల భరించలేక వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

యూనివర్సిటీ విద్యార్ధులు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీలు వేములకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేశాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ కూడా వారితో కలిసి ఆందోళనలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

దీంతో రోహిత్ ఆత్మహత్య గురించి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా ఛానల్స్, పత్రికలలో వార్తలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు కానీ రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడంతో హైకోర్టు ఆ కేసుని కొట్టేసింది. 

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రోహిత్ తల్లి రాధిక నేడు సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి తన కొడుకు ఆత్మహత్యపై పునర్విచారణ జరిపించి, అతనిని ఆత్మహత్య చేసుకునేలా వేధించినవారికి శిక్ష పడేలా చేయాలని కోరారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి ఆమెకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


Related Post