ఇక నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌ మెట్రో సర్వీసులు

May 18, 2024
img

హైదరాబాద్‌ మెట్రో సంస్థ అధికారులు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొన్ని అధనపు సర్వీసులను జోడించారు. ఇప్పటివరకు ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్ళు తిరుగుతున్నాయి.

కానీ ఇక నుంచి ప్రతీ సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయి. మిగిలిన రోజులలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.

ఇక నుంచి ప్రతీ రోజూ రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మెట్రో రైళ్ళలో రద్దీ పెరిగినందున ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రో సేవలను పెంచామని హైదరాబాద్‌ మెట్రో అధికారులు తెలిపారు. 

ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకి సుమారు 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు, రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు చాలా మంది మెట్రోలో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఐ‌టి ఉద్యోగులు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు.

ఈ కారణంగా మెట్రో రైళ్ళు మధ్యాహ్నం కూడా రద్దీగానే ఉంటున్నాయి. కనుక రద్దీని బట్టి ప్రతీ 4-5 నిమిషాలకు ఒకటి చూపున నడిపిస్తున్నారు. కానీ ఇంతకంటే ఎక్కువ రైళ్ళు  నడిపించే అవకాశం లేదు కనుక మెట్రో రైళ్ళకు అదనపు బోగీలు జోడించక తప్పదేమో?

Related Post