ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి దేశంలో నిత్యం లక్షల కోట్ల నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. చేతిలో ఫోన్ ఉంటే చాలు పర్సు ఉన్నట్లే లెక్క. దేనికైనా ఫోన్ ద్వారా డబ్బు చెల్లించవచ్చు.
కానీ ఒక్కోసారి హడావుడిలో లేదా పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బు పంపించేస్తుంటాము. అది చిన్న మొత్తం అయితే పర్వాలేదు కానీ వందలు వేలు అయితే దానిని వెనక్కు తెచ్చుకోలేనప్పుడు ఉస్సూరుమనిపిస్తుంది. ఇటువంటి చేదు అనుభవం ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎదురయ్యే ఉంటుంది.
ఈ సమస్యపై దృష్టి సారించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ నంబర్: 1800 1201 740 ని ఏర్పాటు చేసింది. ఆ నంబరుకి ఫోన్ చేసి వివరాలు చెపితే పొరపాటున చెల్లించిన ఆ డబ్బు మొత్తం 48 గంటల్లోగా మన బ్యాంక్ ఖాతాలోకి తిరిగి వచ్చేస్తుంది.
అన్ని బ్యాంకులలో కూడా ఈ సౌకర్యం ఉన్నప్పటికీ అక్కడ పూర్తివివరాలు తెలియజేస్తూ ఓ దరఖాస్తు ఫారం నింపి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అయినా కూడా తిరిగి వచ్చే అవకాశం తక్కువే.
కనుక ఇకపై ఈ పొరపాటు చేస్తే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ టోల్ ఫ్రీ నంబరుకి ఫోన్ చేసి చెల్లింపు వివరాలు చెపితే చాలు మీ సొమ్ము మీకు తిరిగి వచ్చేస్తుంది.