విజయ్‌ దేవరకొండ మరో కొత్త సినిమా

May 04, 2024


img

రౌడీ హీరోగా ముద్రని ఎంజాయ్ చేసిన విజయ్‌ దేవరకొండ, లైగర్‌తో ఎదురు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ ‘ఫ్యామిలీ స్టార్’గా మారేందుకు చేసిన ప్రయత్నం కొంత వరకు ఫలించింది. కనుక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఓ సీక్రెట్ ఏజంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమా పూర్తికాక ముందే విజయ్‌ దేవరకొండ మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. ‘రాజావారూ రాణీవారు’ తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తన సొంత బ్యానర్‌ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. 

ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలను విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మే 9న ప్రకటిస్తామని దిల్‌రాజు చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష