రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. చూసేందుకు వెళుతున్నారా?

September 24, 2022
img

రేపు ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మద్య టి20 మ్యాచ్ జరుగబోతోంది. టికెట్ల అమ్మకాల సమయంలో జరిగిన తొక్కిసలాటలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణకు ఏకంగా 2,500 మంది పోలీసులను మోహరించారు. స్టేడియం చుట్టూ 15 కిమీల పరిధిలో 3,000 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి అక్కడి నుంచి కూడా జనాల కదలికలను, పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. డయల్ 100 నంబరుకు అదనంగా 94906 17111 హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారు. 

మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహనాలను మళ్లించబోతున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలు కేటాయించారు. ఆ వివరాలు: 

ఉప్పల్, హబ్సీగూడా నుంచి వచ్చే వాహనాలు: జెన్‌పాక్ట్ సర్వీసస్ రోడ్, హిందూ ఆఫీస్, మెట్రో రైల్వే స్టేషన్‌ వద్ద పార్క్ చేయవలసి ఉంటుంది. 

ఉప్పల్, రామాంతపూర్ నుంచి వచ్చే వాహనాలు: రామాంతపూర్, ఉప్పల్ వైపు గల సినీ పోలీస్, మోడ్రన్ బేకరీ, శక్తి డిటర్జంట్, డీఎస్ఎల్, అవేయ మరియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో పార్క్ చేయవలసి ఉంటుంది. 

 విఐపీ పాసులు కలిగి తారాక వైపు నుంచి వచ్చేవారు: హబ్సీగూడ, ఎన్‌జీఆర్ఐ, ఏక్‌మీనార్ మీదుగా గేట్-1లోకి ప్రవేశించాలి. అంబర్ పేట వైపు నుంచి వచ్చేవారు దూరదర్శన్, రామాంతపూర్, రోడ్ నంబర్:8 మార్గంలో స్టేడియంలోకి ప్రవేశించాలి. నాగోల్, వరంగల్‌ జాతీయ రహదారివైపు నుంచి వచ్చేవారు ఉప్పల్ క్రాస్ రోడ్స్, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్‌మీనార్ మీదుగా స్టేడియంలోకి ప్రవేశించాలి. 

Related Post